Sunday, April 28, 2024
- Advertisement -

దేవీ ఎంట్రీతో తమన్ ఖుషీ

- Advertisement -

మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్ హీరో ఎంట్రీ ఖాయమైపోయింది. దేవీ క్లోజ్ ఫ్రెండ్ సుకుమార్ డైరెక్షన్ లో.. టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా ఈ మూవీ ఫైనల్ అయ్యింది. సినిమాకు రాక్ స్టార్ అని కూడా పేరు పెట్టే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంత వరకు అందరికి తెలిసిందే.. ఇందులో కొత్తేముంది అనుకోకండి. దేవీ హీరోగా యాక్ట్ చేస్తుండడంపై.. ఇండస్ట్రీలో కొందరికి ఫుల్ హ్యాపీగా ఉండటం.. టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతోంది. అందులో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఒకరని గుసగుసలు మొదలవడం.. ఆసక్తిని కలిగిస్తోంది.

కొన్నాళ్లుగా ఎందరు పోటీ వచ్చినా.. తన స్టార్ డమ్ ను, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్ ను దేవీశ్రీ ప్రసాద్ అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి డైరెక్టర్లకు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలకు పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ చాలా క్రేజీ ప్రాజెక్టులకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

టాలీవుడ్ తో పాటు.. సౌత్ మొత్తం డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో.. సినిమా హీరోగా దేవీ ప్రాజెక్ట్ ఫైనల్ కావడంతో.. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు.

హీరో అయ్యాక.. మ్యూజిక్ డైరెక్షన్ పై దేవీ పూర్తిగా శ్రద్ధ పెట్టే అవకాశం లేదని.. మొదటి సినిమా సక్సెస్ అయితే వరుసగా హీరో చాన్స్ లు కూడా వచ్చే అవకాశం ఉందని ఆ కొందరు చెబుతున్నారు. ఈ వాదనను పూర్తిగా కొట్టిపారేయలేం కాబట్టి..

దేవీ తర్వాత ప్లేస్ లో ఉన్న తమన్.. ముందు ముందు డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా మారే అవకాశాలనూ తీసి పారేయలేం.ఇవే లెక్కల్లో ఉన్న తమన్ కూడా.. తనకు ఇంకా మంచి రోజులు ముందున్నాయని అనుకుంటున్నాడట. చూడాలి… ఈ గుసగుస ఎంత వరకు నిజమవుతుందో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -