Saturday, April 27, 2024
- Advertisement -

NBK 109..గ్లింప్స్ వచ్చేస్తోంది

- Advertisement -

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో ఇది 109వ సినిమా కాగా వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చేస్తున్న సినిమా ఇది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇవాళ శివరాత్రి కానుకగా గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. అఖండ, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలకు సంగీతం అందించిన తమన్‌ మరోసారి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయనున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మిస్తున్న ఈ చిత్రం లో బాబీ డియోల్ కీలక పాత్రలో పోషిస్తున్నారు.

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా ఇటీవలె ఊటిలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -