Sunday, April 28, 2024
- Advertisement -

కల్కి..శివరాత్రి స్పెషల్

- Advertisement -

మహాశివరాత్రి సందర్భంగా కల్కి మూవీ నుండి స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటానీ హీరోయిన్స్‌గా నటిస్తుండగా ఇవాళ హీరో నేమ్ పై అప్డేట్ ను ఇవ్వనున్నారు.

సాయంత్రం 5:00 గంటలకు ప్రభాస్ పాత్ర పేరును రివీల్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ లో శివలింగం ఆకట్టుకుంటుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తుండగా కమల్ హాసన్‌ విలన్‌గా నటిస్తున్నారు. మలయాళ హీరోయిన్ అన్నా బెన్ కల్కిలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మే 9న విడుదల కానుంది కల్కి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా అద్భుత దృశ్యకావ్యంగా రానుందని మేకర్స్ వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -