Sunday, April 28, 2024
- Advertisement -

బాలయ్య 108వ సినిమా పాట కోసం భారీ సెట్

- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ మూవీ అనౌన్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. పక్కా కమర్షియల్ స్టోరీలతో కామిడీని ఓ రేంజ్ లో పండించే అనిల్ బాలయ్యతో ‘ఎన్‌బీకే 108’గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాని సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో గణేశుడిపై సాగే పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 5 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. అందులో బాలయ్య, శ్రీలీలపై పాటను చిత్రీకరిస్తున్నారు. బాలయ్య కెరియర్‌లోనే అత్యధిక ఖర్చుతో తెరకెక్కుతున్న పాట ఇదేనని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ పాటకు తమన్ బాణీలు సమకూర్చగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకు విడుదల కానుంది.

ఇటీవలె మాస్ ఫీస్ట్ బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ ని విడుదల చేసిన మేకర్స్. బాలకృష్ణ రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తున్న రెండు పోస్టర్లను విడుదల చేశారు. మొదటి పోస్టర్‌ లో సాంప్రదాయ దుస్తులు ధరించి, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ లో కనిపించారు బాలకృష్ణ. మెడ, చేతిపై పవిత్రమైన దారాలను ధరించడం ఆసక్తికరంగా వుంది. బాలకృష్ణ చేతిపై టాటూ కూడా ఉంది. రెండు పోస్టర్లలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని గెటప్‌ లలో కనిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -