- Advertisement -

UPI లావాదేవీలపై ఛార్జ్… ఏటా కేంద్రానికి రూ.5,000 కోట్లు

- Advertisement -

మొబైల్ యూజర్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం ఎక్కువగా గూగుల్ పే, పోన్ పే, పేటియమ్, భారత్ పే వంటి యాప్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని ఉపయోగించి సులభంగా ఇతరులకు మనీ పంపించడం లేదా మనీ అందుకోవడం చేస్తుంటారు. కేవలం మనీ ట్రాన్స్ఫర్ కోసమే కాకుండా మొబైల్ రిచార్జ్, డీటీఎచ్ రిచార్జ్, గ్యాస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ వంటి వాటికోసం కూడా ఈ యాప్స్ ను వినియోగిస్తూ ఉంటాము. ఇక వీటి ద్వారా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు లేకపోవడం వల్ల అందరూ కూడా ఈ యాప్స్ ద్వార యూపీఐ మనీ సెండ్ చేసేందుకే ఆసక్తి చూపుతూ ఉంటారు.

అయితే ఐఐటీ బాంబే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేస్తే.. దానిపై 0.3 శాతం చొప్పున ఛార్జీ వసూలు చేయాలని సంచలన నివేదిక విడుదల చేసింది. యూపీఐ లావాదేవీలన్నింటిపై 0.3 శాతం ఛార్జ్ వసూలు చేయడం ద్వారా.. ప్రభుత్వానికి ఏటా రూ.5 వేల కోట్ల నిధులు సమకూరతాయట.

ఇప్పటికే మొబైల్ వ్యాలెట్స్ ద్వారా చేసే చెల్లింపులపై ఇంటర్‌ఛేంజ్ ఛార్జీల కింద 1.1 శాతాన్ని ఏప్రిల్ 1 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐఐటీ బాంబే నివేదిక పై ప్రభుత్వం అంగీకరిస్తుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: ధరలు పెరిగిన.. తగ్గిన.. వస్తువులు ఇవే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -