Tuesday, April 30, 2024
- Advertisement -

స్టైలిష్ లుక్ లో ‘సాహో’ నటుడు

- Advertisement -

భారీ అంచనాల మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ల తో చిత్రబృందం బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన సినిమా మేకింగ్ వీడియోలు టీజర్ మరియు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరాబేడీ, జాకీ ష్రాఫ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మొట్టమొదటి క్యారెక్టర్ పోస్టర్ను విడుదల చేశారు.

ఇవాళ ‘సాహో’ సినిమా నుంచి నీల్ నితిన్ ముకేష్ క్యారెక్టర్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో జై పాత్ర పోషిస్తున్నారు నీల్ నితిన్. సినిమా నుంచి విడుదలైన ఆ పాత్ర ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బ్లాక్ కలర్ షర్టు గోధుమ రంగు కోటు వేసుకొని కళ్లద్దాలు పెట్టుకొని నితిన్ ముకేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ పైన “ముగింపు అన్నిటికి సమాధానం కాదు” అంటూ ఆసక్తికరమైన కాప్షన్ ను కూడా పెట్టారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో యు.వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -