Monday, May 13, 2024
- Advertisement -

అనసూయని షో నుంచి తీసేయండి అంటూ నెటిజన్లు ఫైర్..!

- Advertisement -

ఈ మధ్యకాలంలో అనసూయ చేసే ప్రోగ్రామ్స్ పై ప్రేక్షకులు మండిపడుతున్నారు. అనసూయని తీసేయండి లేదంటే షో ఆపేయండి.. ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నాం అంటూ తిట్టిపోస్తున్నారు. కానీ అనసూయ మాత్రం ఇది గ్లామర్ ఫీల్డ్.. ఇక్కడ ఇలా ఉంటేనే చూస్తారని చెబుతుంది. అయితే అనసూయ చెప్పేది కరక్టే కానీ చూసే జనంలో చిన్న పిల్లలు ఉంటారు.. ఓ తండ్రి తన కూతురుతో కలిసి చూస్తాడు. ఇలా ఫ్యామిలీలో అందరు చూస్తారు. వాళ్లు చూసేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతారని నెటిజన్లు అంటున్నారు.

ఇక విషయంలోకి వెళ్తే.. ‘లోకల్ గ్యాంగ్స్’ అనసూయ జడ్జిగా వ్యవహరిస్తోంది. అందుకు సంబంధించిన గత వారం ఎపిసోడ్ ప్రోమో చూస్తే.. ‘అబ్బో నీ యమ్మ గొప్పదే’ అంటూ శేఖర్ మాస్టర్‌తో కలిసి స్టేజ్‌పై పెద్ద సినిమానే చూపించేస్తున్నారు అనసూయ. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అసలు ఆమె ఒంటిపై ఉన్నదాన్ని చీర అంటారా? అన్నట్టుగా నడుము, ఎదభాగం మొత్తం కనిపించేట్టుగా శేఖర్ మాస్టర్‌తో రొమాన్స్ చేస్తూ ఎప్పటిలాగే ఆరబోతకు పరిధిలు చెరిపేసింది అనసూయ. సినిమాల్లో అందాలు మరి ఎక్కువైతే కట్ చెప్పడానికి సెన్సార్ బోర్డ్ ఉంది. కానీ బుల్లితెరపై అలాంటివి లేకపోవడం వల్ల అనసూయ రెచ్చిపోయింది.

ఇంత మితిమీర అందాల ప్రదర్శన అవసరమా? ఆలోచించండి మేడమ్ అని కొంతమంది చాలా సాఫ్ట్‌గా ఈ ప్రోమోపై రియాక్ట్ అవుతుంటే.. మరికొంత మంది బూతులు తిడుతున్నారు. ఆమెను ఆ షోనుండి తీసేస్తారా? లేక చూడటం మానేయమంటారా? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే అనసూయ వల్ల ఈ షోకి కాస్తో కూస్తో రేటింగ్ వచ్చింది. అయితే అందాల ప్రదర్శన ఉంటనే రేటింగ్ వస్తుందన్న ఆలోచనలో కూడా ఇలా చేయాల్సి వస్తుందని కొందరు అంటున్నారు. అలానే యాంకర్ సుమ హోస్ట్ చేస్తే ప్రోగ్రామ్‌కి రేటింగ్ ఎలా వస్తుంది? అది చూసైన నేర్చుకో అనసూయ అని నెటిజన్లు చురకలు వేస్తున్నారు. ఇక ఆ ప్రోమోని మీరు కూడా చూసేయండి.

https://www.youtube.com/watch?v=obWDyBwSVVE

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -