Monday, April 29, 2024
- Advertisement -

షాహీద్ తో ఎఫైర్ పై అసలు విషయం చెప్పిన సానియా మీర్జా..!

- Advertisement -

బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్.. హిట్, ప్లాప్ అనే తేడా లేకుండా ముందుకు సాగుతున్నాడు. అయితే షాహిద్ లైఫ్ లోకి ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ వంటి వారు వచ్చి వెళ్ళారు. అయితే షాకీద్ కరీనాతో విడిపోయాక టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో డేటింగ్ చేశారనే సంగత్తి మీడియాలో పెద్దగా చర్చనీయాంశం కాలేదు. అయితే ఈ విషయంను కరణ్ జోహార్ మీడియాలో బహిర్గతం చేశారు.

విషయంలోకి వెళ్తే.. జబ్ వీ మెట్ మూవీ టైంలో షాహిద్, కరీనా మధ్య విభేదాలు రావడంతో అప్పటివరకు పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరు విడిపోయారు. ఆ తర్వాత వెంటనే సైఫ్‌తో కరీనా రిలేషన్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత షాహిద్, సానియా మిర్జా మధ్య రొమాంటిక్ రిలేషన్ కొంతకాలం జరిగిన విషయం పెద్దగా హైలైట్ కాలేదు. అయితే ఇటీవల ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ తన షోలో సానియాతో షాహిద్ ప్రేమ గురించి చెప్పుకొచ్చాడు. మీరిద్దరూ డేటింగ్ చేశారనే రూమర్లు వచ్చాయి. అవి నిజమేనా అంటూ సానియను కరణ్ అడిగాడు. షాహిద్‌తో డేటింగ్ పరోక్షంగా నిజమే అన్నట్లు ఒప్పుకుంటూ.. కాకపోతే అప్పటి విషయాలు తనకు గుర్తులేవని పెదవి దాటేసింది. అది చాలా కాలం క్రితం జరిగిన విషయం.

నా జీవితంలో చాలా దూరం ప్రయాణం చేశాను. ఇప్పుడు ఆ విషయం నాకే గుర్తుకు రావడం లేదు అంటూ షాహిద్‌తో ప్రేమ వ్యవహారాన్ని మర్చిపోయినట్లు తెలిపింది. అయితే షాహిద్, సానియా డేటింగ్ వ్యవహారం మీడియా గుర్తించనంతగా చాలా స్వల్పకాలం జరిగిపోయిందనేది కొందరికి మాత్రమే తెలిసిన విషయం. ఆ తర్వాత సానియా మిర్జా క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో పెళ్లి చేసుకోవడం, సైఫ్‌ను కరీనా పెళ్లి చేసుకోవడంతో షాహిద్ ప్రేమ వ్యవహారాలకు అలా అర్ధాంతరంగా బ్రేకులు పడ్డాయి. తాజాగా కరణ్ కారణంగా ఈ విషయం బయటకు వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -