Tuesday, May 14, 2024
- Advertisement -

మెగా కాంపౌండ్ నుంచి మరో హీరోగా మరో మెగా మేనల్లుడు

- Advertisement -

టాలీవుడ్లో ఇప్పటికే ఏకంగా అష్టదిగ్గజాలైన 8 మంది హీరోలను కలిగిన ఏకైక కాంపౌండ్ మెగా కాంపౌండ్ . ఆల్మోస్ట్ ఈ హీరోలందరూ నటులుగా సక్సెస్ అయిపోవడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ అఛీవ్ మెంట్ గా చెప్పుకోవచ్చు. మిగిలిన కాంపౌండ్ లకు కూడా టాలీవుడ్లో హీరోలు దండిగా ఉన్నప్పటికీ ఎవ్వరూ అంతగా సక్సెస్ అయిన దాఖాలాలు లేవు. అక్కినని ఫ్యామిలీ నుంచి ఓ ఆరుగురు వరకు వస్తే కేవలం నలుగురు మాత్రమే సక్సెస్ అయ్యారు.

అక్కినేని ఫ్యామిలీలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్నది కేవలం ఇద్దరు మాత్రమే. మరి మెగా కాంపౌండ్ లో ఫామ్ లో ఉన్నది 5మంది ఉంటారని చెప్పవచ్చు. ఇది చాలాదన్నట్లు మరో హీరోగా మరో మెగా మేనల్లుడు బయలు దేరిపోయాడు. అతడే పంజా వేమవరం కుర్రాడు… తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ . ఫొటో చూస్తున్నారుగా. అబ్బాయిగారు ఎలా ఉన్నారు. గొప్ప ఫేస్ అయితే కాదు గాని.. ఇతనిలో ఏ స్కిల్ ఉందో ఎవరు చూసొచ్చారు.

వైష్ణవ్ ను కూడా హీరోగా తేవడం కోసం పవన్ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నాడు. ఇందుకుగాను చిన మేనమామ పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అతనిపై ఫోకస్ పెట్టాడు. వైష్ణవ్ తేజ్ లాంచింగ్ ఈవెంట్ కూడా… పవన్ చేతుల మీదుగా ఘనంగా జరపబోతున్నట్లుగా తెలుస్తోంది. అతని మొదటి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ లను పవన్ విని వాటిలో ఒకటి ఫైనల్ చేస్తారట. పవన్ ఓకే అంటే 2018లో ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. అయీ లోపు నటన – డ్యాన్స్ – మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఇంత మంది హీరోలు అంటే కుళ్లు చస్తున్న మిగతా హీరోల అభిమానులు… ఇతను ఫస్ట్ లుక్ వస్తే.. హార్ట్ ఎటాక్ వస్తుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -