Friday, May 3, 2024
- Advertisement -

“రీల్” వెర్సెస్ “రియల్” మలుపు

- Advertisement -

నలుగురు స్నేహితుల మధ్య జరిగిన నిజ జీవిత కధను తీసుకొని, వాళ్ళ జీవితాన్ని అనుకోని విధంగా “మలుపు” తిప్పిన, ఆ “మలుపు” నే కధాంశంగా తీసుకుని, దర్శకుని విన్నూత్న శైలిని ట్రెయిలర్ లోనే చూబించిన చిత్రం “మలుపు”.

తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న తమిళం లో ఫేమస్ అయిన, తెలుగు హీరో, ఫేమస్ డైరెక్టర్ “రవి రాజా పినిశెట్టి” రెండో అబ్బాయి, ఆదీ పినిశెట్టి హీరోగా, ఈయన సోదరుడు,  సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడిగా తమిళంలో , తెలుగులో “మలుపు”గా వస్తోంది, ఈ నెల 19న.

చిత్ర కధాంశంలో, హీరో, అతని ముగ్గురు స్నేహితుల పాత్రలతో పాటు నాయిక నిక్కీ గర్లాని, ప్రతినాయకుడు సీనియర్ నటుడు మిధున్ చక్రవర్తీ పాత్రలు హైలైట్ అవ్వనున్నాయని అంటున్నారు, “మలుపు” చిత్ర యూనిట్. ఇండస్ట్రీ ఆడియన్స్, తెలుగు ఫిలిం ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారిన “మలుపు” సినిమాకు సంబంధించి, మరో సస్పెన్స్,  పోస్టర్ రూపంలో వీడింది.

నిజ జీవిత కధ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలోని నాలుగు కీలక పాత్రల లుక్, ఈ కధను తమ జీవితంలో అనుభవించిన నలుగు కుర్రాళ్ళు ఎలా ఉంటారో పరిచయం చేస్తూ, ఒక పోస్టర్ రిలీజ్ చేసారు “మలుపు” టీం. నిజ జీవిత కధలను, గాధలను ఆధారంగా చేసుకొని, ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు ఒచ్చినా, ఈ తరహా ఆలోచన, ఖచ్చితంగా ఇంతకు మునుపు ఎవ్వరికీ రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -