ఇస్మార్ట్ శంకర్ సినిమా తో రామ్ పోతినేని కి చాలా మంచి పేరొచ్చింది. హీరో గా పరాజయాల తో సతమతమవుతున్న రామ్ కి ఈ సినిమా విజయం పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా విజయం లో చాలా మందికి క్రెడిట్ ఇవ్వాలి. ఈ సినిమా లో హీరోయిన్లు గా చేసిన నభ నటేష్ మరియు నిధి అగర్వాల్ కూడా చాలా బాగా నటించారు. కొంత మంది అయితే ఈ ఇద్దరినీ చూడటానికి కూడా సినిమా ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, ప్రమోషన్స్ లో మాత్రం ఈ మధ్య నభ కన్నా ఎక్కువగా నిధి కనిపిస్తుంది.
నిధి ఈ సినిమా లో మంచి పాత్ర పోషించిన నభ పాత్ర మాత్రమే ఇంపాక్ట్ క్రియేట్ చేయగల పాత్ర. అయితే నభ కన్నా ఇప్పుడు నిధి ఎక్కువ గా మీడియా లో కనిపిస్తూ ఉండటం వెనుక గల రహస్యం ఎవరికీ అంతు చిక్కడం లేదు.
కొందరు చెప్పడం అయితే నభ తనకీ రావాల్సిన ఇంపార్టెన్స్ రావడం లేదు అని, అందుకే హర్ట్ అయినట్లు తెలిపింది.ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా అవుతున్నా కానీ నభ మాత్రం ఢిల్లీ వెళ్ళిపోయింది.