మనసు మార్చుకున్నా మహేష్..

- Advertisement -

ప్రిన్స్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే తాజాగా వదిలిన ప్రోమో వీడియోతో అధికారికంగా ప్రకటించేశారు. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై “ఎస్ఎస్ఎమ్‌బీ28” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. మళ్లీ వీరి కాంబినేషన్ 11సంవత్సరాల తర్వాత హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.

అయితే మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగు కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇప్పటికే పూర్తి కావలసి ఉండగా మరల బ్రేక్ ఇచ్చి, త్రివిక్రమ్ సినిమా చేయడం వలన మరికాస్త ఆలస్యమవుతుంది. ముందుగా ‘సర్కారువారి పాట’ షూటింగును పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

అయితే దసరా లోపు సర్కారువారి పాట’ షూటింగును పూర్తిచేసుకొని దసరా పండుగ రోజున త్రివిక్రమ్ సినిమాని లాంఛనంగా ప్రారంభించి. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ కి జోడీగా పూజ హెగ్డే – నభా నటేశ్ నటిస్తున్నట్టు సమాచారం.

Also Read: ఈసారి బిగ్ బాస్ 5 టూ…..మచ్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -