Thursday, May 2, 2024
- Advertisement -

నీహారిక ఒక మనసు సమంతది!

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక హీరోయిన్ నటించిన ఒక మనసు చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కొంత కాలంగా బుల్లితెర మీద, వెబ్ సీరీస్ లతో అభిమానులను అలరించిన నిహారిక ఇప్పుడు ఒక మనసు సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక ఓ చిత్రంలో నీహారిక నటిచింది కాబట్టి క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది అని అనుకున్నారు.

కానీ ఈ చిత్ర దర్శకుడు రామరాజు చెప్పిన మాటలను పరిశిలిస్తే నిహారిక సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ తప్ప సినిమా కథే అసలు హైలెట్ అని తెలుస్తుంది. నిజాన్నికి ఈ చిత్రంలో ముందు సమంతను హీరోయిన్ గా తీసుకుందామని అనుకున్నాడట దర్శకుడు రామరాజు. అయితే ఈ కథ సమంతకు వినిపించాడట రామరాజు. కథ నచ్చిన సమంత చేద్దాం అనుకుందంట.

కానీ ఆ టైంలో సమంత డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఒక మనసు ని వదులుకుంది. అంతేకాదు ఈ చిత్రాన్నికి మరో హీరోయిన్ రెజినా కూడా ఓకే చెప్పిందట. ఇమె కూడా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక వదులుకోవాల్సి వచ్చిందట. ఇక ఆ టైంలోనే నిహారిక ఎంట్రీ ఇస్తుంది అనే న్యూస్ రావడంతో ఆమెను హీరోయిన్ గా తీసుకుందాం అని నీహారికని అడిగారట. కథ నచ్చిన నీహారిక వెంటనే ఒప్పేసుకుందట. సో అలా ఒక మనసు నిహారిక ఎకౌంట్ లోకి వచ్చింది. మధురా శ్రీధర్, టివి-9 కలిసి నిర్మించిన ఈ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటించాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -