Sunday, May 12, 2024
- Advertisement -

హీరో రామ్ ఏలాంటి పాత్ర చేయబోతున్నాడో తెలుసా?

- Advertisement -

పటాస్‌, సుప్రీమ్‌ సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఈ రెండు చిత్రాలు మంచి హిట్ కొట్టడం తో టాలీవుడ్ లో ఈ దర్శకుడికి మంచి క్రేజ్ ఏర్పడింది. నేను శైలజ తో మంచి ఫామ్ లోకి వచ్చిన రామ్.. ఈ దర్శకుడితో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ట్విట్ట‌ర్‌లో తెలిపాడు.

ఈ చిత్రంలో రామ్ గుడ్డివాడిగా న‌టించ‌డానికి ఒప్పుకొని అంద‌రికీ షాక్ ఇచ్చాడు. మాములుగా మన హీరోలు గుడ్డి, మూగ వంటి వైకల్యం ఉన్న పాత్రలు చేయటానికి అంతగా ఇష్టపడరు. ఎక్కువగా కమర్షియల్ హంగులతో ఉండే చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపిస్తూంటారు. అలాగే ఈ చిత్రం కూడా పక్కా కమర్షియల్ చిత్రం అని అంటున్నారు.

తన రెండు చిత్రాల మాదిరిగానే ఈ చిత్ర కథను కూడా పూర్తి మాస్ గా సిద్ధం చేస్తున్నాడట అనీల్ రావిపూడి. ప్రస్తుతం రామ్ సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అవ్వగానే అనీల్ రావిపూడి చిత్రంలో నటించనున్నాడు. ఎన‌ర్జిటిక్ రామ్‌ని గుడ్డివాడి పాత్ర‌ చేయడం పెద్ద సాహ‌సమే అని చెప్పాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -