Thursday, May 16, 2024
- Advertisement -

సూర్య‌కాంతంగా నిహారిక‌

- Advertisement -

సినిమా హిట్ కాకున్నా వెబ్ సిరీస్‌ల‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న మెగా కూతురు నిహారిక ఇప్పుడు ఒక విభిన్న ప్రాంతంలో వ‌స్తోంది. ఇంత‌కుముందు చేసిన పాత్ర‌ల క‌న్నా ఓ కొత్త పాత్ర‌లో మెర‌వ‌నుంది. మెగా ఫ్యామిలి నుంచి హీరోయిన్‌గా నిహారిక కొణిదెల ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా నాగ‌శౌర్య‌తో తీసిన ఒక మనసు అంతగా హిట్ కాకపోవ‌డంతో అవ‌కాశాలు రాలేదు. దీంతో వెబ్‌సిరీస్‌లతో అలాగే రియాలిటీ షోలతో నిహారిక తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం త‌మిళ్‌లో విజ‌య్ సేతుప‌తితో ఓరు నల్ల నాల్ పాతు సోల్రేన్ సినిమా చేస్తోంది. త్వరలోనే సినిమా విడుద‌ల కానుంది.

ఇప్పుడు తెలుగులో మంచి అవ‌కాశం ల‌భించింది. సూర్యకాంతం అనే సినిమాను త్వరలోనే ప్రారంభిస్తార‌ని సమాచారం. నిహారిక – సూర్యకాంతంగా కనిపిస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్‌సిరీస్‌ను నిహారిక‌తో తీసిన ద‌ర్శ‌కుడు ప్రణీత్ బ్రమంధపల్లి ఈ సినిమాకు దర్శకత్వం చేస్తాడ‌ని స‌మాచారం. అదిత్ అరుణ్ – కాళిదాస్ హీరోలుగా ఈ సినిమాలో కనిపించనున్నారు. త్వరలోనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. నిహారిక తండ్రి నాగబాబు ఈ సినిమాను ఓకే చెప్పడ‌మే ఆల‌స్యం. నాగ‌బాబు ఓకే త‌ర్వాత అధికారికంగా సినిమా టైటిల్ ఫస్ట్ లుక్‌ని త‌దిత‌ర వివ‌రాలు వెల్ల‌డిస్తారు. నిహారిక ప్ర‌స్తుతం సుమంత్ అశ్విన్‌తో క‌లిసి హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -