Friday, April 26, 2024
- Advertisement -

సంక్రాంతి బ‌రిలో గెలిచే సినిమా గ్యాంగ్‌

- Advertisement -
  • గ్యాంగ్ సినిమా రివ్యూ

    తెలుగులో త‌మిళ హీరోల‌కు మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోల స్థాయిలో త‌మిళ్ హీరోల‌కు ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్ న‌టీన‌టుల‌ను మ‌న‌వాళ్లుగా చేసుకొని త‌నకు కొంచెం మార్కెట్‌ని సృష్టించుకున్నారు సూర్య. అందుకే ఆయ‌న సినిమాల‌పై త‌మిళం స్థాయిలోనే తెలుగులో ఆడుతుంటాయి. ఈసారి సంక్రాంతి బ‌రిలో ఆయ‌న న‌టించిన `గ్యాంగ్‌` సినిమా విడుద‌ల‌య్యింది. హిందీలో విజ‌య‌వంత‌మైన `స్పెష‌ల్ చ‌బ్బీస్‌` స్ఫూర్తితో దర్శకుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా కోసం తొలిసారి సూర్య తెలుగులో డ‌బ్బింగ్ చెప్పారు.

క‌థ‌: తిలక్‌ (సూర్య) అనే యువ‌కుడు ఎప్పటికైనా సీబీఐ అధికారి కావాలని కలలు కంటుంటాడు. అయితే అత‌డి తండ్రి సీబీఐలో ఓ క్లర్క్‌. ప‌రీక్ష పాస‌యి ఇంటర్వ్యూకు వెళ్లితే అవమానం జరుగుతుంది. ఉద్యోగం రాదు. ఆ స‌మ‌యంలో తిలక్‌ స్నేహితుడు పోలీసు కావాలంటే లంచం ఇస్తేనే ఉద్యోగం అని చెప్పడంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటాడు. ఇవన్నీ చూసి కడుపు మండిన తిలక్‌ తనే అనధికారికంగా సీబీఐ అధికారి అవతారం ఎత్తుతాడు. తనలాగే కష్టాల్లో ఉన్న వారితో కలిసి ఒక `గ్యాంగ్‌`ను కూడా ఏర్పాటు చేసుకుంటుంటాడు. సీబీఐ పేరు చెప్పి అక్రమార్కుల నుంచి డబ్బు కాజేయడమే త‌మ‌ గ్యాంగ్ పని. ఆ డబ్బునంతా సొంతానికి కాకుండా మంచి పనుల కోసం వినియోగిస్తుంటారు. మరి ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు నిజమైన సీబీఐ అధికారులు ఏం చేశారు? గ్యాంగ్‌ సభ్యులు పట్టుబడ్డారా? లేదా? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే…

ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని ఎత్తిచూపుతూ వారి బాధ్యతను గుర్తు చేస్తూ తీసిన సినిమా ఇది. తొలి సగభాగం సినిమా పాత్రల ప‌రిచ‌యంతో ముగుస్తుంది. సెకండాఫ్‌ నకిలీ సీబీఐ గ్యాంగ్‌ అక్రమార్కుల సొమ్మును కాజేసే సంఘటనలతో సాగుతుంది. ఆ సన్నివేశాల్లోనే వినోదంతో ఆక‌ట్టుకున్నారు. గ్యాంగ్ ఏర్పాటు ఫ్లాష్‌బ్యాక్‌తో హృదయానికి హత్తుకునేలా తీశారు. విరామం సమయానికి సీబీఐ అధికారులకు గ్యాంగ్‌ ఆచూకీ తెలుస్తుంది. ద్వితీయార్ధం మొత్తం ఆ గ్యాంగ్‌ను వెంటాడే ప్రయత్నం… గ్యాంగ్‌ కూడా సీబీఐ అధికారులకు దీటుగా ఎత్తుకు పైఎత్తులు వేయడంతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా ముగింపు సన్నివేశాలు స‌స్పెన్స్‌గా కొన‌సాగుతూ ముగుస్తుంది.

సూర్య న‌ట‌న అద్భుతం. అత‌డు ఎప్ప‌టిలాగే న‌టించి ఆక‌ట్టుకున్నాడు. సీబీఐ అధికారిగా రమ్యకృష్ణ, సీబీఐ బాస్‌ నటుడు కార్తీక్ క‌నిపిస్తారు. కీర్తిసురేశ్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటలకు, ల‌వ్ సీన్ల‌కు ప‌రిమిత‌మైంది. పాత్ర‌దారులంద‌రూ త‌మ‌ పరిధి మేరకు చేశారు. 1987 నేపథ్యంతో సినిమా తీయ‌డంతో దానిక‌నుగుణంగా సాంకేతికంగా సినిమా ఉంది. అనిరుధ్ మ్యూజిక్ సూప‌ర్‌.

1987లో యదార్థ ఘటనతో సినిమా తీశారు. తెలుగు వెర్షన్‌లో తమిళ వాసనలు బాగా ఉన్నాయి. కొంచెం తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇబ్బంది ఏర్ప‌డుతుంది. సూర్య తన తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడంతో తెలుగువారికి కిక్ ఇచ్చే అంశం.సంక్రాంతి బ‌రిలో జై సింహా, అజ్ఞాత‌వాసితో పోటీపడి సూర్య గ్యాంగ్ న‌డిచే అవ‌కాశం ఉంది.

న‌టీన‌టులు:సూర్య, కీర్తి సురేశ్‌, కార్తీక్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం త‌దిత‌రులు
దర్శకత్వం: విఘ్నేశ్‌ శివ‌న్‌
నిర్మాత‌లు: కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా.. వంశీ, ప్రమోద్‌
సంగీతం: అనిరుధ్‌
మాట‌లు: శ‌శాంక్ వెన్నెల‌కంటి

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -