Wednesday, April 24, 2024
- Advertisement -

యూట్యూబ్ లో ఉడక పేట్టిస్తున్న నితిన్ భీష్మ సాంగ్

- Advertisement -

‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్, రష్మిక మందన రొమాంటిక్ లవ్ స్టోరీ భీష్మ సినిమా నుండి మాస్ సాంగ్ ‘వాట్ యే బ్యూటీ’ వీడియో ప్రోమో రిలీజ్ అయి యూట్యూబ్ ట్రేండింగ్ లో ఉన్నది.

మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. దీనికి తోడు కాసర్ల శ్యామ్ రాసిన పాటలో లిరిక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్‌లో నితిన్ స్టెప్స్.. రష్మిక గ్లామర్ హైలైట్‌గా నిలిచింది. చూస్తుంటే ఈ సినిమాలో నితిన్ రష్మికల మధ్య కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని అర్థమవుతోంది.

ఇప్పుడు చిత్రబృందం లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో ఉడక పెట్టిస్తుంది. ఈ సినిమాలో వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ హైలెట్ గా నిలవనున్నటు సమాచారం. హెబ్బా పటేల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -