Saturday, April 20, 2024
- Advertisement -

చల్ మోహన రంగ’ ఫ‌స్ట్‌లుక్ రివ్యూ

- Advertisement -

ఫిక్ష‌న్‌గా నితిన్ సినిమా

త‌న‌కు న‌చ్చిన వారితో క‌లిపి నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆనందంగా నితిన్ ఉన్నాడు. తాను అభిమానించే న‌టుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ నిర్మాణంలో కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో ‘చల్ మోహన రంగ’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేశారు. ఆ సినిమా ఫ‌స్ట్‌లుక్ చూస్తుంటే సైన్స్ ఫిక్ష‌న్‌గా క‌నిపిస్తోంది.

‘చల్ మోహన రంగ’ టైటిల్ పక్కన ‘ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైన్’ అనే క్యాప్షన్ ఉన్నపుస్తకం ఉంది. ఆ ప‌క్క‌నే చక్రంలాంటి బొమ్మ, లవ్ సింబల్స్‌, బాటిల్‌, కుక్క ఉన్నాయి. ‘ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైన్’ అనడం ద్వారా ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ అనే సంకేతాలు ఇస్తోంది. టైటిల్ లోగోలో కనిపించిన సంకేతాల చుట్టూనే ఈ సినిమా ఉండేలా కనిపిస్తోంది. ర‌చ‌యిత‌గా పరిచయమై ఉన్నట్లు ఉండి దర్శకుడిగా కృష్ణచైతన్య మారాడు. తొలి సినిమా ‘రౌడీఫెలో’తో భిన్నమైన సినిమా తీశాడు. ఆ సినిమా హిట్ కాకున్నా ద‌ర్శ‌కుడిగా నిరూపించుకోవ‌డంతో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆ సినిమాను త్రివిక్రమ్ కూడా మెచ్చుకున్నాడు. దీంతో వెంట‌నే త్రివిక్రమ్ రచనా సహకారంతో కృష్ణచైతన్య సినిమా ప్రారంభించాడు.

నితిన్ గ‌తంలో ‘లై’ సినిమాపై ఆశలు పెట్టుకోగా ఆ సినిమాతో బోల్తాకొట్టింది. హను రాఘవపూడితో నితిన్ కొత్తగా ట్రై చేయ‌గా ప్రేక్షకులకు న‌చ్చలేదు. నితిన్ మ‌రో సినిమా శ్రీనివాస్ క‌ల్యాణం కూడా చేస్తున్నాడు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -