Wednesday, May 22, 2024
- Advertisement -

నితిన్ పెళ్లి వాయిదా.. అతని కాబోయే భార్య ఏమన్నాదంటే ?

- Advertisement -

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ లో హీరో నితిన్ కూడా ఒక్కడు. ఈ ఏడాది నితిన్ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 16 న దుబాయ్ లో తన డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం అన్ని చోట్ల లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో హైదరాబాద్ లోనే వెడ్డింగ్ జరపాలని అనుకున్నారు.

అయితే ఇప్పుడు లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రకటించడంతో ఇప్పుడు పెళ్లిని పూర్తిగా వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట నితిన్ మరియు అతని కుటుంబ సభ్యులు. ఈ విషయంను నితినే చెప్పాడు. అలానే తనకు కాబోయే భార్య షాలిని కి కూడా చేప్తే.. ఆమె రియాక్షన్ కు నితిన్ అండ్ ఫ్యామిలీ షాక్ అయ్యారట. నితిన్ మాట్లాడుతూ…”పెళ్ళి కొన్నాళ్ళు వాయిదా వేస్తె బెటర్ అని నేను షాలినీ కి చెప్పాలని డిసైడ్ అయ్యాను.

దీనికి ఆమె ఏమంటుందా అని మొదట నేను టెన్షన్ అయ్యాను. కానీ ఆమె..’పెళ్లంటే జీవితంలో ఒక సారి మాత్రమే చూసుకునేది.కాబట్టి ఎంతో ఘనంగా చేసుకోవాలి. అంతే కానీ మాస్క్ లు … శానిటైజర్లు పెట్టుకుని భయం.. భయంగా చూసుకునేది కాదు. అంతా సెట్ అయ్యాక ఘనంగా చేసుకుందాం’ అని ఆమె రిప్లై ఇచ్చిందని చెప్పాడు. షాలిని నా కంటే బాగా ఆలోచించిందని నితిన్ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -