Friday, May 3, 2024
- Advertisement -

నా రికార్డులు బ్రేక్ చేడం అంత ఈజీ కాదు : హైపర్ ఆది

- Advertisement -

జబర్దస్త్‌కు టెలివిజన్ రంగంలో మంచి పేరు ఉంది. ఎన్ని షోలు వచ్చిన జబర్దస్త్‌కు ఎదురేలేకండా పోయింది. అయితే ఈ టైంలో మరో చానెల్‌లో అదిరింది షో రావడంతో జబర్దస్త్ కు కాస్త పోటీ ఇస్తున్నట్లు కనపడుతోంది. అయితే అదిరింది షోలో సద్దామ్ రేటింగ్ హైపర్ ఆది కంటే ఎక్కువగా ఉంది. ఈ విషయంపై హైపర్ ఆది స్పందిస్తూ.. ఎవరి ప్రతిభ వారిది.

కానీ వారి టాలెంట్‌ను కేవలం ఐదు వారాల్లోనే నిర్ధారించడం సరికాదు. నా విషయంలో గత ఐదేళ్లుగా ఒకే షోలో ఒకే టీమ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాం. అంతేకానీ భ్రమల్లో బతకడం కుదరదు అని హైపర్ ఆది పంచ్ ఇచ్చాడు. అయితే ఇలాంటి పోలీకల్ కామనే. కానీ వాస్తవాలేంటో భ్రమలేంటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. హైపర్ ఆదిని దాటలాంటే కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను 100కుపైగా స్కిట్లు చేశాను. అందులో 10 మిలియన్లు దాటిన వీడియోలు 40 ఉన్నాయి.

20 మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చిన స్కిట్ల వీడియోలు 5కుపైనే ఉన్నాయి. మిలియన్‌కుపైగా వచ్చినవి కూడా ఉన్నాయి. సుమారు 60 మిలియన్లు వచ్చిన వీడియోలు కూడా నా కెరీర్‌లో ఉన్నాయి. సో ఆదిని దాటాలంటే ఇవన్ని దాటాలి. ఎవరైనా ఇలాంటి రికార్డులను దాటితే వాళ్లు గ్రేట్ అని ఒప్పుకొంటాను అని ఆది అన్నాడు. ఇలా పోలీకలు పెట్టుకోవడం మంచిది కాదు. ఎవరి ప్రతిభ, టాలెంట్ వారికే చెందుతుంది. తాము గొప్ప అనేది ఇతరులను చిన్నచూపు చూడవద్దు అని ఆది చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -