Monday, May 13, 2024
- Advertisement -

‘పెద్ద‌పులి’ అంటూ మాస్ బీట్ వేస్కున్న కుర్ర‌ హీరో

- Advertisement -

‘చల్ మోహనరంగ’ సినిమా పాట విడుద‌ల‌

మొన్న లై సినిమాతో భంబోలే ఉంది రా పోరీ అంటూ కొంచెం మాస్ పాట‌తో ఆక‌ట్టుకున్న కుర్ర హీరో నితిన్ ఇప్పుడు ఊర మాస్ బీట్ అందుకున్నాడు. ఇన్నాళ్లు డీజే.. తీన్మార్ పాట‌గా ఉన్న పెద్ద‌పులి పాట‌ను రీమేక్‌గా చేస్తూ నితిన్ స్టెప్పులు వేసేశాడు. పెద్ద‌పులి బీటుకు నితిన్ జోష్‌గా స్టెప్పులేస్తూ హుషారుగా గ‌డిపాడు. జోష్… పూనకాలు తెప్పించే రేంజిలో నితిన్ డ్యాన్స్ చేస్తూ క‌నిపించాడు.

కృష్ణ చైత‌న్య దర్శ‌క‌త్వంలో నితిన్ ‘చల్ మోహనరంగ’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ఇప్పుడు ఆ సినిమాలోని మాస్ పాట ‘పెద్దపులి’ పాట విడుద‌ల‌ చేశారు. మాస్ పాట‌తో నితిన్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు ‘అమెరికా వీసా తెచ్చుకుని గల్లీలోకి వచ్చాక’ అంటూ పాట మొద‌ల‌వుతోంది. అమెరికా వీసా వ‌చ్చినందుకు ఫ్రెండ్స్‌తో చేసే ఎంజాయ్‌మెంట్ స‌మ‌యంలో ఈ పాట వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

నెమ్మదిగా మాటట‌లతో మొదలైన ఈ పాట ఆ త‌ర్వాత ఊపందుకుంది. ఈ పాటకు తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ లెక్కనుంది. తీన్‌మార్ డ్యాన్సులు.. పెద్దపులి వేషాలు.. నాటు డ్యాన్సులు.. మాస్ అల్లర్లతో ఈ పాట మొత్తం హుషారుగా ఉన్న‌ట్టు వీడియోను చూస్తుంటే తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్ మ‌రోసారి తెలంగాణ యాసలో అదిరిపోయే పాట పాడాడు. గ‌తంలో నితిన్ న‌టించిన లై సినిమాలో భంబోలే ఉంది పాట‌ను కూడా రాహూల్ పాడాడు.ఈ సినిమాకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సహ నిర్మాతగా నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ అండ్ పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. లైలో న‌టించిన హీరోయిన్ మేఘా ఆకాశ్ మ‌రోసారి నితిన్‌తో మ‌ళ్లీ న‌టిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -