Sunday, May 5, 2024
- Advertisement -

‘రంగస్థలం’లో రొమాన్స్ డోస్ పెంచిన నాగ్ కోడ‌లు

- Advertisement -

టాలీవుడ్‌లో ఈ మార్చి నెల‌లో విడుద‌ల‌య్యే సినిమాల్లో ‘రంగస్థలం’పైనే ఆశ‌లు ఉన్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత చిట్టిబాబు, రామ‌ల‌క్ష్మిగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలోని పాట‌ల‌ను వ‌రుస‌గా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక మార్చి 18వ తేదీన విశాఖ‌ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించ‌నున్నారు. అయితే మొన్న విడుద‌ల చేసిన రంగ‌మ్మ‌.. మంగ‌మ్మ పాట‌లో స‌మంత మాత్రం రొమాన్స్ డోస్ పెంచేసి క‌నిపిస్తోంది.

రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న అందంగా క‌నిపిస్తూ కుర్ర‌కారుకు హాట్ తెప్పిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ వెంట ప‌డుతూ ముద్దులు ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ క‌నిపిస్తోంది. ముద్దు ముద్దు చేస్తూ లంగావోణిలో బొడ్డు క‌నిపించేట్టు క‌నిపిస్తోంది. ఆ పాట‌లో కూడా త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని క‌వ్విస్తూ ఉంది. ఆ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ ప‌డుకొని ఉంటే ప‌క్క‌న వ‌చ్చి కూర్చొని రెచ్చ‌గొడుతోంది.

ఆ త‌ర్వాత మ‌రో లుక్‌లో మోకాళ్ల‌కు కొంచెం కింది దాకా లంగావోణి వేస్తూ బొడ్డును క‌నిపించేలా స్టిల్స్ ఇచ్చేసింది. చున్నీ పైకెత్తి క‌నిపిస్తూ ఈ విధంగా అందాచందాలు చూపించింది. పాట‌లో స్టిల్స్ ఇలా ఉంటే ఇక సినిమా విడుద‌లైన స‌మ‌యంలో ఈ పాట‌లో ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.

అక్కినేని నాగ‌చైత‌న్యతో పెళ్ల‌యిన త‌ర్వాత కూడా ఇలా అందాలు ఆర‌బోస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. గ్రామీణ ప్రాంతం నేప‌థ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పల్లెటూరి అమ్మాయిలా పైట‌తో ఆడుకుంటోంది. రంగమ్మ మంగమ్మ పాటకు సంబంధించిన ఫొటోస్‌లలో కూడా సమంత ఊర మాస్ లెవెల్లో హావభావాలను అందిస్తూ కుర్రాళ్ల‌ను రెచ్చ‌గొట్టేలా క‌నిపిస్తోంది. ఈ సినిమాలో పూజాహెగ్డేతో కూడా ఒక ఐట‌మ్ సాంగ్ ఉంది. మరీ ఆ పాట‌లో పూజ ఎన్ని అందాలు చూపిస్తుందో చూడాలి. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ సినిమా మార్చి 30వ తేదీన విడుద‌ల కానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -