Friday, May 9, 2025
- Advertisement -

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నితిన్‌

- Advertisement -

హీరో నితిన్‌కు టైం క‌లిసి రావ‌ట్లేదు. ఏ సినిమా తీసిన హిట్ మాత్రం కొట్ట‌లేక‌పోతున్నాడు.ఆ మధ్యన ‘లై’ సినిమాతో నిరాశపరిచిన నితిన్ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో చేసిన ఛల్ మోహన్ రంగా చిత్రం రీసెంట్ గా విడుదలై నిరాశపరిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నితిన్ కెరీర్ ని వెనక్కి లాగిందనే చెప్పాలి. ఇక క‌థ‌ల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరించాలి అని నితిన్ ఫిక్స్ అయినట్టు ఉన్నాడు.అందుకే త‌న త‌రువాత సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాడు.. శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన సతీష్ వేగేశ్న ప్రస్తుతం నితిన్‌ హీరోగా శ్రీనివాస్ కల్యాణం సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ గోదావరి జిల్లాల్లో పూర్తయ్యింది.ఈ సినిమాను జూలై 24న రిలీజ్‌ చేయాలని ముహూర్తం ఫిక్స్‌ చేశారు. లై, ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో శ్రీనివాస కల్యాణం సక్సెస్‌ నితిన్‌ కెరీర్‌కు కీలకంగా మారింది.మరి ఈ సినిమా అయిన నితిన్‌కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -