Thursday, May 2, 2024
- Advertisement -

షాకింగ్ న్యూస్ : వెంకటేష్ తో చేయనంటోన్న హీరోయిన్లు…

- Advertisement -

టాలీవుడ్లో సూపర్ సక్సెస్ ట్రాక్ ఉన్నటువంటి హీరో వెంకటేష్ . ఫ్యామిళీ హీరోగాను ఈయనకు మంచిపేరుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనతో నటించడానికి చాలామంది హీరోయిన్లు పోటీ పడుతుంటారు. కాని అదేంటో ఇపుడు తేజతో చేసే సినిమా విషయం వచ్చేసరికి కొందరు హీరోయిన్లు నేను చేయను బాబోయ్ అంటున్నారు.

వెంకీతో చేయడానికి భామలంతా ఎందుకు నో అంటున్నారు. వెంకీ ఏమైనా హీరోయిన్లను ఇబ్బంది పెట్టే టైపా అంటే అదీ కాదాయో. మరి భామలు విక్టరీతో విక్టరీ కొట్ట డానికి ఎందుకు ససేమిరా అంటున్నారు. ఇదే ఇపుడు అందరినీ వేదిస్తోన్న ప్రశ్న. వెంకీ చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 13న అనగా వెంకీ బర్త్ డే రోజున మొదలవ్వబోతోంది.

ముందుగా ఈసినిమాకు సీనియర్ హీరోయిన్లను సంప్రదిస్తే వారెవరు ఓకే చెప్పలేదు. చివరకు చేసేదేమి లేక తెలుగులో సినిమాలే లేని నిత్యామీనన్ ఎంట్రీ ఇవ్వాల్సివచ్చింది. ఈమెతో చర్చలు నడుస్తున్నాయని ఈవిడగారు దాదాపు ఓకే చెప్పవచ్చని త్వరలో అనౌన్స్ చేస్తామని మరీ చెబుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో స్వయంగా యూనిట్ చెబుతోంది కాబట్టి… హీరోయిన్లు వెంకీతో ఎందుకు చేయనన్నారన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.బహుశ ఇలాంటి సినిమాలో చేస్తే.. గ్లామర్ స్కోప్ తక్కువ ఉండి..శిలా ఫలకంలా ఉండే పాత్రలు ఇస్తున్నారని బ్యూటీలంతా వెంకీతో సినిమా చేయడానికి నో చెప్పి ఉండవచ్చన్నది మరో వాదన.

https://www.youtube.com/watch?v=IkPuIUN0j5w

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -