Wednesday, May 8, 2024
- Advertisement -

లెస్బియ‌న్ పాత్ర‌లో నిత్యామీన‌న్‌

- Advertisement -

సినిమా అవ‌కాశాలు ఎన్ని వ‌స్తున్నా పాత్ర బాగుంటే చిన్న సినిమా అయినా చేసే హీరోయిన్ నిత్య‌మీన‌న్‌. పాత్ర ప‌రిధి త‌క్కువ‌గా ఉన్న బ‌ల‌మైన పాత్రగా ఉంటే మాత్రం అస్స‌లు వ‌దులుకోదు. పైగా ఆ సినిమా హిట్ట‌యినా.. ఫ‌ట్ట‌యినా పట్టించుకోదు. త‌న ప‌రిధి మేర న‌టించి వెళ్లిపోయే వ్య‌క్తిత్వం ఉన్న నిత్య ఇప్పుడు మ‌రో కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నుందట‌.

రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రలకు దూరంగా ఉండే నిత్య విభిన్న పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తూ వెళ్లిపోతోంది. ఆమె చేతిలో తక్కువ సినిమాలున్నా, అవన్నీ వైవిధ్యభరితమైనవే. ప్రస్తుతం నిత్య ఓ ప్రయోగం చేయబోతోందట. స్వలింగ సంపర్కురాలిగా ఓ సినిమాలో న‌టించ‌నుంద‌ని స‌మాచారం. మరో హీరోయిన్‌తో కలిసి లిప్‌ లాక్‌ కూడా చేసిందట. ఆ హీరోయిన్ ఎవరు? ఆ సినిమా ఏమిటి? అనే వివరాలు ఇంకా తెలియాలి. ప్ర‌స్తుతం నిత్య నాని నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ‘అ’ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా వేస‌విలో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -