Thursday, May 23, 2024
- Advertisement -

ఇందిరాగాంధీగా విద్యాబాల‌న్‌

- Advertisement -

దేశ రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర ఇందిరాగాంధీది. దేశాన్ని ఒంటిచేత్తో న‌డిపించిన ధీశాలి ఆమె. రాజ‌కీయాల్లో తిరుగులేని ఆమె ప్ర‌స్థానాన్ని ఓ సినిమాగా తెర‌కెక్కించ‌నున్నారు. ఇందిర జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా బాలీవుడ్‌లో తీయ‌నున్నారు. అంత‌టి మ‌హా యోధురాలి పాత్ర‌లో విద్యాబాల‌న్ న‌టిస్తుందంట‌. ఇప్ప‌టికే సిల్క్ స్మిత పాత్ర‌లో మెరిసిన విద్యాబాలన్‌ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.దర్టి పిక్చర్ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న విద్యాబాలన్‌ తాజాగా ఇందిరాగాంధీ జీవిత చరిత్రలో క‌నిపించనుంది.

మహాత్మాగాంధీ హత్య ఘ‌ట‌న త‌ర్వాత ఇందిరాగాంధీ దారుణ హత్య సంచ‌ల‌నం రేపింది. దేశమంతా అట్టుడుకింది. 16 ఏళ్లుగా భారత ప్రధానమంత్రిగా పరిపాలించిన ఏకైక మహిళా ఇందిరా. అలాంటి ఆమెను 1984 అక్టోబర్ 31వ తేదీన‌ ఢిల్లీలోని తన స్వగృహంలో తన సెక్యూరిటీ చేతిలో తుపాకీ తూటాల‌కు బ‌ల‌య్యింది.

అంత‌టి ఘ‌న చ‌రిత్ర‌ను బుల్లితెర నిర్మాత, రచయిత్రి సహారిక పుస్తకంగా రచించారు. ఈ నవలను నటి విద్యాబాలన్, రాయ్‌కపూర్‌ పొడెక్షన్స్‌తో కలిసి చిత్రంగా రూపొందించడానికి హక్కులను పొందారు. ఈ విషయాన్ని రచయిత సహారికా తన ట్విట్టర్‌లో వెల్ల‌డించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో చెబుతార‌ని పేర్కొన్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -