Sunday, May 19, 2024
- Advertisement -

ఫీల్డ్ కు కొత్త….అయినా ఆగడం లేదు!

- Advertisement -

టాలీవుడ్ కు మరో కొత్త భామ ఎంట్రీ ఖరారైపోయింది. త్రిష,నయన్ ,అమలాపాల్ వచ్చినట్లే..తాజాగా నివేద థామస్ కూడా…మన కుర్రాళ్లను గిలిగింతలు పెట్టడానికి రెఢీ అవుతోంది.

ఇప్పటి వరకూ వచ్చిన అందరి ముద్దుగుమ్మల మాదిరిగానే ఈవిడగారు కూడా టాలీవుడ్లో నిలదొక్కుకుంటానంటూ గొప్పలు పోతోంది. మన ఫీల్డ్ కు కొత్తైనప్పటికీ… కొంగ్రొత్త కథలు చెబుతోన్న ఈ గమ్మత్తైన గుమ్మ ఇప్పటికే శర్వానంద్ ,నవీన్ చంద్ర చిత్రంలో ఓకే అయిపోయింది. అలాగే ఇంద్రగంటి,నాని కాంబినేషన్లో తీసే సినిమాకు అంగీకారం తెలిపింది.

టాలీవుడ్ ఫీల్డ్ కు కొత్తనే అయినప్పటికీ…కోలీవుడ్లో విజయ్ ,కమల్ హాసన్ లతో పని చేసిన అనుభవం ఉంది కాబట్టే నేను ఇక్కడ కూడా ఈదేస్తానంటోంది. మరి నివేద థామస్ ఈదడం ఏంటో, ఆవిడలో ఏముందని చెప్పి దర్శకులు,నిర్మాతలు అవకాశాలిస్తున్నారో అప్ కమింగ్ హీరోయిన్లకు అస్సలు అర్ధం కావడం లేదు. 

కనీసం హీరోయిన్ సైడ్  క్యారెక్టర్ కు కూడా సెట్ కాని నివేదను మనవాళ్లు ఏం చూసి సెలక్ట్ చేస్తున్నారంటూ ఇపుడిపుడే ఎదుగుతూ ఉన్న భామలు కొశ్చన్ చేస్తున్నారు. మీరే చెప్పండి. ఈ ఫొటోలో ఉన్న నివేద థామస్ లాంటి వారు మన అమీర్ పేట్ హాస్టల్లో ఎన్ని వందల మంది ఉండి ఉంటారు.ఏమన్నా అంటే పర్ ఫార్మెన్స్ గాళ్ అంటూ కవరింగ్ లు చేయడం తప్ప.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -