Thursday, May 16, 2024
- Advertisement -

బాహుబలి ని పక్కన పెట్టిన సాక్షి!

- Advertisement -

బాహుబలి సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాకర్లేదు. ఈ చిత్రన్నికి వివిధ భాషల్లో అవార్డలు సొంతం చేసుకుంది. అలాగే ఇటివలే ఈ చిత్రాన్నికి జాతీయ అవార్ వచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ చిత్రంతో రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.

ఎలాంటి ఓటమి ఎరుగని దర్శక ధీరుడి గా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి ని అతడి సినిమా బాహుబలి ని పక్కన పెట్టారు సాక్షి ఎక్స లెన్స్ అవార్డ్స్ విషయంలో. మహేష్ బాబు ని మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తించిన సాక్షి శ్రీమంతుడు చిత్రంతో పాటు రుద్రమదేవి చిత్రాన్ని పరిగణలోకి తీసుకుంది కానీ బాహుబలి కి ఎటువంటి అవార్డ్ రాకపోవడంతో కావాలనే ఆ సినిమాని పక్కన పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన బాహుబలి ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్ల ని సాధించి సంచలనం సృష్టించింది. మరి జాతీయ అవార్డ్ కూడా సొంతం చేసుకున్న బాహుబలి సినిమాకి సాక్షి ఎక్స లెన్స్ వారు ఎందుకు గుర్తించలేదో అర్ధం కావడం లేదు. మరి కొందరు అయితే కావలనే ఇలా చేశారు అని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -