నవంబర్ చిన్న హీరోలదే!

బాక్సాఫీస్ వద్ద దసరా వార్ ముగియడంతో పెద్ద హీరోలంతా చల్లబడ్డారు. అందుకే ఈ నవంబర్‌లో పెద్ద హీరోలు తమ సినిమా విడుదలకు బ్రేక్ ఇవ్వగా చిన్న సినిమాలతో హీరోల సినిమాలతో సందడిగా మారనుంది బాక్సాఫీస్. నవంబర్ ఫస్ట్ వీక్‌లో కీడా కోలా,పొలిమేర 2,నరకాసుర వంటి సినిమాలు సిల్వర్ స్క్రీన్‌ పై సందడి చేయనున్నాయి. వీటితో మరికొన్ని సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్దకు రానున్నాయి.

ఇక సెకండ్ వీక్‌లో అన్వేషి, ఆర్జీవీ వ్యూహం,అలా నిన్ను చెరీ వంటి సినిమాలు రానుండగా అలాగే లారెన్స్ జిగర్తాండ డబుల్ ఎక్స్ రానుంది. రీసెంట్‌గా చంద్రముఖి 2తో నిరాశ పర్చారు లారెన్స్. ఇక ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు లారెన్స్.

అలాగే మూడోవారంలో స్పార్క్, మంగళవారం,సప్తసముద్రాలు దాటి వంటి సినిమాలు రానుండగా ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో వస్తున్న మంగళవారంపై భారీ అంచనాలున్నాయి.

ఇక నాలుగో వారం ఆదికేశవ,కోటబొమ్మాళి పీఎస్ రిలీజ్ కానుండగా ఆదికేశవలో పంజా వైష్ణవ్ తేజ్ – శ్రీలీల ప్రధాన పోత్ర పోషించారు.వాస్తవానికి ఈ సినిమా ఫస్ట్ వీక్‌లోనే రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. నవంబర్ చిన్న సినిమాలకు మంచి స్పేస్ దొరకగా ఎవరు హిట్ కొడతారో వేచిచూడాలి.