Saturday, May 4, 2024
- Advertisement -

బీజేపీ గెలుస్తుందట..కానీ పోటీచేయరంటా!

- Advertisement -

ఒకప్పుడు అధికారం మాదేనని ధీమాలో ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. రోజు ఏ వార్త చూసిన బీజేపీలోకి వలసలే. కానీ కర్ణాటక ఫలితాలు, బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు తర్వాత బీజేపీ ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. బండి అలా తప్పుకున్నాడో లేదో అంతే ఒక్కొక్క నేత పార్టీని వీడుతూనే ఉన్నారు. దీంతో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా తయారైంది అంటే కరుడు గట్టిన కాషాయ నేతలు సైతం పోటీ అంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చేవరకు. పైకి మాత్రం బీజేపీ గెలుస్తుందని గంభీరానికి పోతూనే మరోవైపు పోటీ అంటూ ఆమడ దూరం పరుగెడుతున్నారు బీజేపీ నేతలు.

రేపటి నుండి నామినేషన్ల పర్వం మొదలుకానుండగా సీనియర్ నేతలంతా పోటీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఒక్క ఈటల రాజేందర్ తప్ప బండి సంజయ్,అరింద్ లాంటి నేతలు అయిష్టంగానే అసెంబ్లీ బరిలో నిలిచారు. ఇక టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి,లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి లాంటి నేతలు పోటీ చేయబోమని ప్రకటించారు. దీంతో ఇప్పుడు క్యాడర్‌లో ఇదే చర్చ జరుగుతోంది.

గద్వాల జేజమ్మగా గుర్తింపు పొంది డీకే అరుణ తాను పోటీ చేయనని తేల్చి చెప్పగా మరో సీనియర్ నేత జితేందర్ రెడ్డిని పోటీ చేయమంటే తన కుమారుడకి బీఫాం తీసుకున్నారు. ఇదే బాటలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాను రాజ్యసభ సభ్యుడినని లక్ష్మణ్ ముందే తప్పించుకున్నారు. మల్కాజిగిరి నుండి పోటీచేస్తాని చెప్పిన రామచంద్రరావు ,ఉప్పల్ లో ఎన్‌వీవీఎస్ ప్రభాకర్ ఇలా సీనియర్లు అందరూ పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఓటమిని ముందే అంగీకరించినట్లేనని క్యాడర్‌లో ప్రచారం జరుగుతోంది.

ఇక ఒకప్పుడు చేరికల జోష్‌తో ఊపు మీదున్న బీజేపీ నేతలు ఇప్పుడు తీరా ఎన్నికల సమయం రాగానే ఢీలా పడిపోయారు. పోటీ అంటేనే భయపడే స్ధాయికి చేరుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల వరకు బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అటూ బీజేపీ అధిష్టానం సైతం టీబీజేపీ నేతలను లైట్ తీసుకున్నారు. సీనియర్లు పోటీ చేయకపోయినా, పార్టీ నుంచి ఒక్కొక్రు వెళ్లిపోతున్నా లైట్ తీసుకుంటున్నారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీ ఉనికి కొల్పోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -