Sunday, May 5, 2024
- Advertisement -

కామన్ పీపుల్ కి బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ లేదా..

- Advertisement -

ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ షో లో రెండు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయన్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ 2 లో బోలెడు వివాదాలు తలెత్తాయి. అయితే తాజాగా ఈ విషయంలో ఇలాంటి వివాదాలు మళ్ళీ రాకూడదని బిగ్ బాస్ 3 విషయంలో స్టార్ మా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్బాస్ మూడో సీజన్లో అసలు కామనర్ లను తీసుకోవడం లేదని సమాచారం. సెలబ్రిటీలు మరియు కామన్ పీపుల్ వద్ద చాలా మంది దగ్గర అడగగా అందులో చాలావరకు కామన్ పీపుల్ ని బిగ్ బాస్ లో తీసుకోవద్దని సలహా ఇచ్చారట.

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ మూడవ సీజన్ లో మరింత డ్రామా ఉండబోతోందని మాత్రం కొందరు అంటున్నారు. అంతేకాకుండా అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈక్వల్ గా కాకుండా ఈసారి అబ్బాయిల కంటే ఎక్కువ మంది అమ్మాయిలని ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. దీనిద్వారా యువత దృష్టిని ఆకర్షించాలని బిగ్ బాస్ వారు ప్లాన్ చేస్తున్నారు. రెండవ సీజన్తో పోలిస్తే బిగ్ బాస్ 3 ఎలాంటి వివాదాలు లేకుండా ఆసక్తికరంగా నడుస్తుందని ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -