- Advertisement -

రేణు దేశాయ్ నో ఇష్క్ వాలా లవ్ :

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరాఠీ లో రూపొందించిన చిత్రం ”ఇష్క్ వాలా లవ్ ” చిత్రాన్ని తెలుగులో తనకున్న క్రేజీ దృష్ట్యా రిలీజ్ చేయాలనీ అనుకుంది. అనుకున్నదే తడవుగా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసి గత అక్టోబర్ లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసినప్పటికీ తుఫాన్ వల్ల ఆలస్యం అయిన ఆ చిత్రం గత రెండు నెలలుగా విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.

ఐతే దీని వెనకాల ఎవరో అదృశ్య శక్తి ఉన్నారని అందుకే రేణు దర్శకత్వం వహించిన ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇష్క్ వాలా లవ్ చిత్రంలో పవర్ స్టార్ వారసుడు అకిరా నందన్ చిన్న పాత్రలో మెరవను న్నాడట. దాంతో బుల్లి పవర్ స్టార్ కోసం అభిమానులు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్నప్పటికి ఆ చిత్రం మాత్రం విడుదల కావడం లేదు. మరి ఆ చిత్రం ఎప్పుడు వస్తుందో ? ఏంటో ? చూడాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -