సినిమాలకు స్వస్తి పలకనున్న విజయ్..?

No More Movies After political entry says Thalapathy Vijay
No More Movies After political entry says Thalapathy Vijay

తలపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘తలపతి 68’లో నటించనున్నారు. అయితే గత కొంత కాలంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి సినిమాలకు విరామం తీసుకున్నట్లు మీడియా సర్కిల్స్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

2024 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట పోతున్నట్టు సమాచారం. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు చెందిన విజయ్ మక్కల్ ఇయక్కం నేతలతో విజయ్ సమావేశమయ్యారు. చెన్నైలోని పనైయూర్‌లోని సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అందుతున్న సమాచారం ప్రకారం తాను రాజకీయాల్లోకి వచ్చే సమయం వచ్చినప్పుడు సినిమాల నుంచి తప్పుకుంటానని, తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటానని విజయ్‌ ఈ సమావేశంలో చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు విజయ్ రాజకీయ ప్రవేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.

అయితే తలపతి విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పడం, ఆకస్మిక రాజకీయ ప్రవేశం పై వస్తున్న వార్త సినీ ప్రేమికులకు ఖచ్చితంగా షాక్ అని చెప్పవచ్చు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు రజనీకాంత్, అజిత్ కుమార్ అభిమానులు విజయ్‌కి మద్దతు ఇస్తారని విజయ్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సోషల్ మీడియాలో అజిత్ కుమార్ మరియు రజనీకాంత్ అభిమానుల కలయికపై విజయ్ అభిమానుల మధ్య నిరంతరం తగాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.