హరీష్ శంకర్ తో రవితేజ భారీ బడ్జెట్ సినిమా

Ravi Teja Big Budget film with Harish Shankar
Ravi Teja Big Budget film with Harish Shankar

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. 2006లో షాక్ సినిమాతో దర్శకుడిగా హరీష్ శంకర్ పరిచయం అయ్యాడు. రవితేజ, జ్యోతిక నటించిన ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. 5 సంవత్సరాల తర్వాత 2011లో ’మిరపకాయ్’ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరి కాంబో సూపర్‌హిట్ గా నిలిచింది. వీరిద్దరి సెన్సిబిలిటీస్, ఆన్-స్క్రీన్ ఎగ్జిక్యూషన్ ప్రేక్షకులకు నచ్చింది. ఈ కాంబో చేతులు కలపాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి.

ఇప్పుడు, ఈ కాంబో భారీ బడ్జెట్ పాన్-ఇండియన్ చిత్రం కోసం చేతులు కలుపుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి, ఇటీవలి ట్విట్టర్‍లో దర్శకుడు హరీష్ శంకర్, రవితేజతో మూడవ ప్రాజెక్ట్ పై స్పందించారు. త్వరలో రానున్నట్లు ధృవీకరించారు.

Also Read: సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న చిరు?

ఇటివల ట్విట్టర్‌ AMA సెషన్‌లో, మాస్ మహారాజా రవితేజను హరీష్ శంకర్‌తో మళ్లీ ఎప్పుడు కలిసి పనిచేస్తారని అడిగారు. అందుకు తనదైన స్టైల్‌లో ఎక్సయిటింగ్ అప్‌డేట్ ఇచ్చారు. పీరియాడికల్ డ్రామా కోసం రవితేజతో కలిసి పని చేస్తానని, మరిన్ని అప్‌డేట్‌లను త్వరలో పంచుకుంటానని దర్శకుడు ధృవీకరించారు.

ప్రస్తుతానికి, మాస్ మహారాజా టైగర్ నాగేశ్వరరావుతో బిజీగా ఉన్నాడు, ఇది ఈ సంవత్సరం చివరిలో ఉంటుంది. ఆ తర్వాత ఈగిల్ కూడా వస్తోంది. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఆ తర్వాత ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ చేసే అవకాశం ఉంది.

Also Read: విజయ్ లియోలో రామ్ చరణ్…