తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ తరుపు నుంచి విశ్వనటుడు కమల్ హాసన్ అండ్ టీమ్ పోటీ చేశారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో ఆయన బీజేపికి చెందిన వనతి శ్రీనివాసన్ పై పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో తొలుత పలు రౌండ్ల పాటు కమల్ తన సమీప ప్రత్యర్థి ఆదిక్యత కనబరిచినా చివరి నిమిషంలో ఓటమి పాలయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి,బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్‌పై 1500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.దీంతో అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక నెరవేరకుండా పోయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు.
అయితే తాను ఓట్ల కోసం డబ్బులు పంచబోనని, సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించడమే తన లక్ష్యమని ముందే ప్రకటించిన కమల్ అన్న మాటను చేసి చూపారు. ఈ ఎన్నికల్లో కమల్ సహా ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎంఎన్ఎం తరఫున బరిలోకి దిగిన వారంతా ఎక్కడా డబ్బులు పంచలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓటరు దృష్టిని ఆకర్షించలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
టివి నటుడు రాజేష్ దత్త పై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య!