Sunday, May 12, 2024
- Advertisement -

‘కాలా’ కొనే నాధుడు లేడా!

- Advertisement -

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క్రేజ్‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్పల్సిన ప‌ని లేదు.ఆయ‌న సినిమాలు రీలిజ్ అవుతుంటే త‌మ సినిమాలు వాయిదా వేసుకుంటారు.ఆయ‌న క్రేజ్ త‌మిళ్‌లోనే కాదు తెలుగులోను అదేవిధాంగా ఉంది. కాలా సినిమా వ‌స్తుంద‌ని మ‌హేష్ భ‌ర‌త్ అను నేను సినిమా ముందుగా జ‌రిపి మ‌రి రీలిజ్ చేశాడు. ఇక అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా ర‌జ‌నీ వ‌స్తున్నార‌ని త‌న సినిమాను వాయిదా వేసుకున్నాడు.అలాంటి ర‌జ‌నీకాంత్ కాలా సినిమా కొనేవాడే క‌నిపించ‌డం లేదు.కాలా సినిమా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని జూన్ 7న విడుద‌ల‌కు రెడీ అవుతుంది.

సినిమాపై అంచనాలు బాగానే ఉన్న‌ప్ప‌టికి చిత్ర నిర్మాత డ‌బ్బింగ్ రైట్స్ 40 కోట్లుకు ఒక్క రూపాయి కూడా ద‌గ్గ‌ను అని చెప్ప‌డంతో ఇప్పుడు ఈ సినిమా కొనే నాధుడు లేడ‌నిపిస్తుంది.20 కోట్ల‌కు కొంట‌మ‌ని చాలామంది ముందుకు వ‌చ్చిన ధ‌నుష్ 40 కోట్లు ఫిక్స్ చేయ‌డంతో ఎవ‌రు ముందుకు రావ‌డం లేదు. దీనికి కార‌ణం గ‌తంలో ర‌జ‌నీకాంత్ సినిమాలు మిగిల్చిన న‌ష్ట‌ల‌ను చూసి డిస్టిబ్యూట‌ర్స్ బ‌య‌ప‌డుతున్నారు.రోబో త‌ప్ప ర‌జినీ సినిమాలు తెలుగులో ఏమి పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు.దీంతో అంద‌రు బ‌య‌ప‌డిపోతున్నారు.రోబో 2.0 సినిమా 80 కోట్ల‌కు అమ్మార‌ని ఇప్పుడు కాలా సినిమాను అందులో స‌గనికి అమ్మ‌ల‌ని ధ‌నుష్ ప్ర‌య‌త్నిస్తున్నాడు.మ‌రి ధ‌నుష్ ఆశ ఫ‌లిస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -