Wednesday, May 7, 2025
- Advertisement -

”నో సెక్స్ ప్లీజ్…” అని అంటున్న హీరోగారి కూతురు!

- Advertisement -

ఇప్పటికే సంచలన సినిమాలను నిర్మించిన ఘనత ఉంది ఏక్తా కపూర్ కు. బాలీవుడ్ హీరో జితేంద్ర తనయగా హిందీ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కెరీర్ లో  రాణిస్తున్న ఏక్తా ఇప్పుడు మరో సంచలన సినిమాకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా పేరు “నో సెక్స్ ప్లీజ్.. వి ఆర్ ఇండియన్స్”. ఈసినిమాలో ఏక్తాతో పాటు కరణ్ జొహార్ కూడా వాటాదారు. 

మరి టైటిల్ దగ్గర నుంచే ఈ సినిమా సంచలనంలా ఉంది. ఇందులో దిషా పతానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె ఎవరో కాదు.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా రాబోతున్న సినిమాలో హీరోయిన్ ఈమెనే. బాలీవుడ్ లో వస్తున్న “నో సెక్స్ ప్లీజ్…” సినిమాతోనే ఆమె తెరకు పరిచయం కాబోతోంది.

మరి ఇది వరకూ ఏక్తా రూపొందించిన ‘డర్టీ పిక్చర్” వంటి సినిమాలు సంచలనo సృష్టించాయి. అవార్డులు కూడా పొందాయి. ఇలాంటి నేపథ్యంలో తన  ప్రొడక్షన్ లో వస్తున్న “నో సెక్స్ ప్లీజ్” ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -