ఎన్టీఆర్‌ 30 ప్రాజెక్టులో ఆ హీరోయిన్

తన 30వ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ఆర్‌ఆర్ఆర్‌తో పాన్ ఇండియా హీరోగా మారిన తారక్.. తన నెక్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఎన్టీఆర్‌ 30 ప్రాజెక్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ముందుగా ఈ మూవీలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తుందన్న ప్రచారం జరిగింది.

ఆర్‌ఆర్‌ఆర్ విడుదలకు ముందు ఆలియా భట్ సైతం దీనిపై సంకేతాలు ఇచ్చింది. ఎన్టీఆర్‌తో నటించబోతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఆలియా నటించడం లేదని తెలుస్తోంది. ఇటీవలే పెళ్లి పీటలెక్కిన ఆలియా ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

దాంతో ఆమె స్థానంలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారన్న ప్రశ్న తలెత్తింది. దీనికి చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే బాలీవుడ్ నటి దిశా పటానీని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మూవీ మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మహేశ్ బాబు సినిమాలో నాని

ఆ హీరోతో సమంత లిప్ లాక్ సీన్

లెక్చరర్ గా పవన్ కల్యాణ్

Related Articles

Most Populer

Recent Posts