Sunday, April 28, 2024
- Advertisement -

దిశాతో బీచ్‌లో ప్రభాస్ రొమాన్స్!

- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 AD. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ అయిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండగా తాజాగా ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ప్రభాస్ -దిశా పటాని మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ఫోటో వైరల్‌గా మారింది.

ఆ ఫొటోలో అందమైన సముద్రం ఒడ్డున కెమెరా కనిపిస్తుండగా ఇటలీలో జరుగుతున్న సాంగ్ షూటింగ్‌కి సంబంధించింది అని తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా టీజర్‌ని రిలీజ్ చేయనుండగా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకురానుంది. రాజేంద్రప్రసాద్, రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ పలు పాత్రల్లో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -