Thursday, May 16, 2024
- Advertisement -

రికార్డుల‌ను వేటాడుతున్న అర‌విందుడు

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తుంది.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గ‌త శుక్ర‌వారం విడుద‌ల అయింది.సినిమాకు మొద‌టి ఆట నుంచే హిట్ టాక్ రావ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిల‌వ‌నుంద‌ని తెలుస్తుంది.సినిమా మొద‌టి రోజునే 60 కోట్లు క‌లెక్ట్ చేసి నాన్ బాహుబ‌లిగా రికార్డు సృష్టించింది.ఇక రెండో రోజు 14 కోట్లు వ‌సూళ్లు సాధించిన‌ట్లుగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.వీకెండ్ కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ న‌టించిన జైల‌వకుశ సినిమానే టాప్ ప్లేస్‌లో ఉంది.

జైల‌వ‌కుశ ఓవ‌ర్‌ఆల్‌గా 132 కోట్లు సాధించింది.అర‌వింద సమేత జైల‌వకుశ రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశం ఉంది. అర‌వింద స‌మేత ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా నిలిచే అవ‌కాశాలు ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు తెర మీద చూపించని కొత్త‌ర‌క‌మైన ఫ్యాక్ష‌న్ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు త్రివిక్ర‌మ్‌.మొద‌టిసారి త్రివిక్ర‌మ్ త‌న స్టైల్‌ని ప‌క్క‌న పెట్టి మ‌రి ఈ సినిమాను తెర‌కెక్కించాడు.ఎన్టీఆర్ న‌ట‌న‌తో పాటు,పూజా హెగ్డె,ఈషా రెబ్బాల గ్లామ‌ర్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి.ఇక త‌మ‌న్ అందించిన సంగీతం సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకువెళ్లింద‌ని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు.ఏది ఏమైన‌ప్ప‌టికి ఎన్టీఆర్ ఖాతాలో మ‌రో హిట్ వ‌చ్చి చేరింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -