Saturday, May 10, 2025
- Advertisement -

ఎన్టీఆర్ ‘అర‌వింద స‌మేత’ ట్రైల‌ర్‌…!

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం అర‌వింద స‌మేత‌.శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది ఈ సినిమా.హైద‌రాబాద్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు.వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా రేపు(గురువారం) సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.ఇక ఈ సినిమాను త్వ‌రగా పూర్తి చేసి ద‌స‌రా బ‌రిలో నిల‌ప‌ల‌ని భావిస్తున్నాడు ఎన్టీఆర్‌.

హ‌రికృష్ణ మ‌ర‌ణంతో సినిమా వాయిదా ప‌డుతుంద‌ని భావించిన‌ప్ప‌టికి ,త‌న వ‌ల్ల సినిమా ఆల‌స్యం కాకూడ‌ద‌ని ఎన్టీఆర్ షూటింగ్ పాల్గోన్నారు.ఈ సినిమాలో హీరోయిన్స్‌గా పూజా హెగ్డె ,ఈషా రెబ్బాలు న‌టిస్తున్నారు.ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడని స‌మాచారం.ఇక త్రివిక్ర‌మ్ ఈ సినిమాతో త‌న స‌త్త చాట‌ల‌ని అనుకుంటున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -