Wednesday, May 15, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌ బయోపిక్ నుంచి మామ‌, అళ్లుడు కొత్త‌ పోస్ట‌ర్ విడుద‌ల‌..

- Advertisement -

తెలుగింటి ముద్దుబిడ్డ, నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఒక చరిత్ర. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం, స్ఫూర్తిదాయకం. అందుకే తెలుగువారితో ‘అన్నగారు’ అని పిలిపించుకున్న ఆ మహానుభావుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ బ‌యోపిక్‌లో చంద్ర‌బాబు పాత్ర ఎలాఉంటాద‌నేది అంద‌రిలోనూ అంచ‌నాల‌ను పెంచేస్తోంది.

ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు, యువరత్న నందమూరి బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలిసిందే. బాబు పాత్ర‌లో రానా న‌టిస్తున్నారు.ఇప్పటికే చంద్రబాబు ఫస్ట్ లుక్ తో అంచనాలను అమాంతం పెంచేసిన ‘ఎన్టీఆర్’ సినిమా బృందం తాజాగా అభిమానుల కోసం మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. వినాయక చవితి సందర్భంగా సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసింది. ఇందులో చంద్రబాబు భుజంపై చేయి వేసిన ఎన్టీఆర్.

చంద్రబాబు భుజంపై ఎన్టీఆర్ చేయివేసి మాట్లాడుతున్నట్టు ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఎన్టీఆర్‌గా బాలయ్య, చంద్రబాబుగా రానా గెటప్‌లు అదిరిపోయాయి. అసలు ఆ పాత్రలకు ప్రాణం పోసినట్టు ఉన్నాయి. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తున్నారు

ఇక ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నాడు. 2019, సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -