Saturday, May 4, 2024
- Advertisement -

తండ్రి, కొడుకుల‌పై పోటీకీ సై అంటున్న నేత‌లు…

- Advertisement -

తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో ప్ర‌చారంలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఒకే సారి 105 మంది అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించిన గులాబీ బాస్ ప్ర‌తిప‌క్ష ముఖ్య‌నాయ‌కుల నియోజ‌క వ‌ర్గాల్లో మాత్రం అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌కుండా వ్యూహాత్మ‌కంగా ముందుకెల్తున్నారు. వారిపై పోటీకీ స‌మ‌ర్థులైన నేత‌ల‌క కోసం కేసీఆర్ వేట కొన‌సాగిస్తున్నారు.

ఇక ప్ర‌తిప‌క్షాలు కూడా కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు చెక్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్ద‌రినీ ధీటుగా ఎదుర్కొనేందుకు ఆస్త్రాల‌ను సిద్ధం చేస్తున్నారు. ఇద్ద‌రిపై పోటీకీ బ‌ల‌మైన ప్ర‌జా మ‌ద్ద‌తు ఉన్న గ‌ద్ద‌ర్‌, విమ‌ల‌క్క‌ల‌ను నిలిపేందుకు సిద్ధంగా ఉన్నార‌ని టీమాస్ ఫోరం ఛైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య తెలిపారు.

గద్దర్, విమలక్కలు మాత్రమే తెలంగాణ వారసులని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం వీరిద్దరూ ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. గద్దర్‌ రాష్ట్రం కోసం పోరాడుతుంటే అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపిందని.. ఆయనకు 6 బుల్లెట్‌లు తగిలాయని, విమలక్క కాలుకు గజ్జె కట్టి రాష్ట్రం కోసం ఆడీపాడారని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -