Saturday, April 27, 2024
- Advertisement -

ప‌వ‌న్ అజ్ఞాత‌వాసిపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్‌

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ,మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా అజ్ఞాత‌వాసి. భారీ అంచనాల నడుమ వ‌చ్చిన ఈ సినిమా ప‌వ‌న్ కెరీర్‌లోనే అతి పెద్ద ప్లాప్‌గా నిలిచింది.త్రివిక్ర‌మ్ ఈ సినిమ‌తో చాలా నెగిటివ్  కామెంట్స్ ని ఎదుర్కొవాల్సి వ‌చ్చింది.అజ్ఞాతవాసి ప్లాప్‌తో ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌తో సినిమా చేస్తారో లేదో అని అభిమానులు సందేహించారు.కాని వారి అనుమానల‌ను బ్రేక్ చేస్తు త్రివిక్ర‌మ్‌తో అర‌వింద స‌మేత సినిమా పూర్తి చేశాడు ఎన్టీఆర్‌.

తాజాగా తార‌క్ ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి ప్లాప్‌పై స్పందించారు.నేనెప్పుడూ అజ్ఞాతవాసి రిజల్ట్ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడుతుందని అనుకోలేదు. ప్రతి సినిమా ఒక డిఫరెంట్ జర్నీ. ఈ ప్రయాణంలో కొన్ని సార్లు హిట్స్ వస్తాయి.. కొన్ని సార్లు ఫ్లాప్ లు వస్తాయి. నా కెరీర్ లో కూడా నేను కొన్ని ఫ్లాప్ సినిమాలలో నటించాను.’అరవింద సమేత వీర రాఘవ’ అనేది కంప్లీట్ త్రివిక్రమ్ సినిమా. నేను ఆయన కలలో, ప్రయాణంలో ఒక భాగాన్ని మాత్రమే అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్‌.ద‌స‌రాకు కానుక‌గా సినిమాను ఈ నెల 11న విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -