యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ సినిమాగా తెరకెక్కుతున్న నాన్నకుప్రేమతో నిజంగానే ఓ స్పెషల్ సినిమా కాబోతుంది. ఎన్టీఆర్ సినిమాలంటే భారీ అంచనాలు కామన్ కాని ఈ సారి అంచనాలకు తోడు మైల్ స్టోన్ మూవీ అవ్వడంతో రికార్డులను తిరగరాయడమే లక్షంగా నాన్నకుప్రేమతో ఒక్కో రికార్డును నెలకొలుపుతూ టాలీవుడ్ క్రేజీయెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన చిన్న టీసర్ తో ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేసిన నాన్నకుప్రేమతో నైజాం రైట్స్ కూడా కనీవినీ ఎరగని రేట్లకి అమ్ముడై రికార్డు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ రేటు 17.50 కోట్లు దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లోనూ భారీ రేటు దక్కించుకుని ఎన్టీఆర్ కెరీర్ లో నెంబర్ వన్ గా నిలిచింది.ఈ సినిమాను సుమారు 7 కోట్లకి అమ్మినట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటివలే టెంపర్ తో ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ లో ఎంటర్ అయిన ఎన్టీఆర్ ఈ సినిమాతో కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని చెబుతున్నారు.
సుకుమార్ కూడా తన సినిమాలన్నింటిలో బలమైన స్టోరీలైన్ ఉన్న సినిమా ఇదే అని చెబుతున్నాడు. ఈ దెబ్బతో ఎన్టీఆర్ స్టామినా గురించి ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. ఇది తమ హీరో రేంజ్ అని సంతోషంగా చెప్పుకుంటున్నారు.
