Sunday, May 12, 2024
- Advertisement -

కుమారీ 21 ఎఫ్ కలక్షన్ లు అదరహో ..

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రచనలు అంటే తెలుగు యువత పడి చస్తారు. ఆయన రచనల్లో బోల్డ్ తనం, పిచ్చిగా ఉండే ప్రేమ, కన్ఫ్యూజన్ ఆ రేంజ్ లో ఉంటాయి మరి. ఒక నవనూతన ప్రేమ కథగా కుమారీ 21 ఎఫ్ ని తెరకి ఎక్కించారు ఆయన. న్నిన్న ప్రేక్షకుల ముందరకి వచ్చిన ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ గా యువత కి విపరీతంగా నచ్చేస్తోంది. 

మొదటి షో నుంచే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కనీసం సుకుమార్ కూడా ఊహించనట్టుగా కొన్ని ఊళ్లలో చిన్న హీరో అయినా రాజ్ తరుణ్ కి బెనిఫిట్ షో లు పడ్డాయి అంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కుమారి 21F ద్వారా చెప్పిన ఓ బోల్డ్ పాయింట్ ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అని ఈ చిత్ర టీం కాస్త టెన్షన్ పడ్డారు. 

కానీ ఆ పాయింట్ ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానం, సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ మరియు కలెక్షన్స్ చూసి సుకుమార్ అండ్ టీం చాలా థ్రిల్ ఫీలవుతున్నారు.  సెకండ్ హాఫ్ లాస్ట్ అరగంట లో సుకుమార్ సినిమాని డీల్ చేసిన విధానం అదిరిపోయింది. బ్యాక్ టూ బ్యాక్ ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా లతో హిట్ లు కొట్టిన రాజ్ ఈ సినిమాతో ఇంకా ఆదరకోట్టేసాడు, కుమారీ తో హ్యాట్రిక్ కొట్టి వహ్వా అనిపించుకున్నాడు. మొదటి రోజు కలక్షన్ లు అధికారికంగా ఇంకా తెలియాల్సి ఉంది. 

దేవీ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ , సుకుమార్ రచన ప్రధానంగా సాగిన ఈ సినిమా చాలా బాగా కలక్ట్ చేస్తుంది అని అంటున్నారు. కనీసం డే 1 న రెండు కోట్లకి పైగా కలక్ట్ చేసి సుకుమార్ రేంజ్ ని నిరూపించింది ఈ సినిమా . 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -