బిగ్‌బాస్ 2లో ఎన్టీఆర్ ఏంటీ అనుకుంటున్నారా! అవునండీ నిజమే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్‌లో కనిపించనున్నాడు.తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ బిగ్‌బాస్ చేయడంతో ఈ షోకి మంచి పాపులరీటి వచ్చింది.ఎన్టీఆర్ తన సహజ నటనతో షోని జనాలలోకి తీసుకువెళ్లాడు.
తను వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా సూపర్‌స్టార్‌నే అని నిరుపించుకున్నాడు. షో రేటింగ్స్ కూడా టాప్‌లో ఉండటంతో రెండువ సీజన్‌కు కూడా ఎన్టీఆర్ యాంకర్‌గా వ్యవహరిస్తాడు అని అందరు అనుకున్నారు.అయితే త్రివిక్రమ్ సినిమాతో బిజిగా ఉండటం వల్ల బిగ్‌బాస్ రెండువ సీజన్‌కు ఎన్టీఆర్ దూరం అయ్యాడు.దీంతో బిగ్‌బాస్ రెండువ సీజన్‌కు న్యాచురల్ స్టార్ నానిని యాంకర్‌గాతీసుకుంది బిగ్‌బాస్ టీమ్.మరి నాని ఎన్టీఆర్ లాగా జనాలను మెప్పించగలడా అనేది పక్కన పెడితే,ఎన్టీఆర్ బిగ్‌బాస్-2లో కనిపిస్తాడని సమాచారం.అయితే ఎన్ఠీఆర్ బిగ్‌బాస్‌లో యాంకర్‌గా చేయడం లేదు.
అలా అని కంటెస్ట్‌గా కూడా ఎన్టీఆర్ కనిపించడం లేదు.మరి ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు అనే కదా మీ డౌట్!బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు యాంకర్‌గా పనిచేసిన ఎన్టీఆర్,రెండువ సీజన్ ప్రారంభ వేడుకలో కనిపించి సందడి చేయనున్నాడని సమాచారం.నానిని బిగ్‌బాస్ రెండువ సీజన్‌కు యాంకర్‌గా పరిచియం చేసి ఎన్టీఆర్ వెళ్లిపోతాడని తెలుస్తుంది.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే జూన్ 10 వరకు ఆగాల్సిందే.