Sunday, April 28, 2024
- Advertisement -

రీ రిలీజ్ లో పంబ రేగ్గొట్టిన వసూళ్లు.. ఎవరు ముందు ఎవరు వెనకాల లెక్క తెలిస్తే మైండ్ బ్లాక్..!

- Advertisement -

ఈమధ్య స్టార్ సినిమాల ఓల్డ్ క్లాసిక్ హిట్స్ అన్నీ వరుస రీ రిలీజ్ లు అవుతున్నాయి. మొదట మహేష్ ఒక్కడు 4K రీ రిలీజ్ చేయగా అప్పటి నుంచి వరుస సినిమాలు రిలీజ్ అవుతూనే వస్తున్నాయి. ఈ రీ రిలీజ్ టైం లో కూడా రికార్డ్ వసూళ్లు సాధిస్తూ స్టార్ స్టామినా చూపిస్తున్నాయి. రీ రిలీజ్ సినిమాల్లో ఏది హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా ఏ హీరో బాక్సాఫీస్ పంగ రేగ్గొట్టే వసూళ్లు సాధించాడు అన్నది ఇప్పుడు చూద్దాం.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఖుషి. ఈ సినిమా రీ రిలీజ్ టైం లో విపరీతమైన్ క్రేజ్ ఏర్పరచుకుంది. అప్పటి యూత్ ఇప్పుడు దాదాపు అంకుల్స్ అయిపోయినా కూడా ఖుషి సినిమాను ఇరగ చూశారు. అంతేకాదు పవన్ ని అభిమానించే ఈతరం యూత్ ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. పవన్ ఖుషి సినిమా రీ రిలీజ్ టైం లో 7.46 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. స్టార్ సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ లో ఇదే టాప్ ప్లేస్ లో ఉంది.

ఆ తర్వాత ఎన్.టి.ఆర్ నటించిన సింహాద్రి సినిమా రెండో ప్లేస్ లో ఉంది. ఈ సినిమా కూడా 4కె వెర్షన్ రిలీజ్ కాగా ఈ సినిమా కూడా 4.60 కోట్లు కలెక్ట్ చేసింది. ఎన్.టి.ఆర్ మాస్ స్టామినా మరోసారి ప్రూవ్ చేస్తూ సింహాద్రి రీ రిలీజ్ వసూళ్లు మోగమోగించాయి. ఇక ఈ రీ రిలీజ్ హంగామాలో తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది కూడా సూపర్ బ్లాస్టింగ్ కలెక్షన్స్ తెచ్చుకుంది. ఈ నగరానికి ఏమైంది సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ అవగా ఆ సినిమా 3.50 కోట్ల దాకా కలెక్షన్స్ సాధించింది. తరుణ్ భాస్కర్ డైరెక్టోరియల్ విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం నటించిన ఈ సినిమా యూత్ ఆడియస్ కి బాగా ఎక్కేసింది.

ఈ లిస్ట్ లో నెక్స్ట్ ఆరెంజ్ సినిమా తర్వాత ప్లేస్ లో ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ టైం లో డిజాస్టర్ అయితే రీ రిలీజ్ లో 3.36 కోట్లతో వసూళ్ల హంగామా సృష్టించింది. గ్లోబల్ స్టార్ చరణ్ స్టామినా చూపించేలా రీ రిలీజ్ టైం వసూళ్లు ఉన్నాయి. ఈ సినిమా వసూళ్లను జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు నిర్మాత నాగ బాబు.

ఇక పవన్ కళ్యాణ్ జల్సా కూడా రీ రిలీజ్ లో 3.20 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. మహేష్ నటించిన ఒక్కడు సినిమా 2.54 కోట్లను కలెక్ట్ చేయగా పోకిరి సినిమా 1.73 కోట్లు రాబట్టింది. అల్లు అర్జున్ దేశముదురు సినిమా 1.65 కోట్లు పవన్ తొలిప్రేమ 1.52 కోట్లు రాబట్టాయి. బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి కూడా రీ రిలీజ్ చేయ్గా 1.10 కోట్ల దాకా వసూళ్లు తెచ్చుకుంది. ప్రభాస్ బిల్లా సినిమా రీ రిలీజ్ టైం లో 1.05 కోట్లు రాబట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -