Saturday, May 18, 2024
- Advertisement -

మే 28న ‘జనతా గ్యారేజ్’ టీజర్‌ రిలీజ్!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తాడని గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్‌లుక్, టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి కానీ.. అంతకంటే వెరైటీగా అతని గెటప్ ఈ చిత్రంలో ఉంటుందని ఈ చిత్ర యూనిట్ అంటుంది. దాంతో.. ఫస్ట్ లుక్ ఎపుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంది. అయితే ఈ చిత్రం రిలీజ్  ఎప్పుడో అధికారికంగా ఇదివరకే ప్రకటించేశారు. జూ.ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మే 20న ఫస్ట్‌లుక్‌ని, టీజర్‌ని సీనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా మే 28న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.

ఇప్పుడు ఆ టీజర్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమాలో కొన్ని ముంబాయి షూటింగ్ షాట్స్‌ని కట్ చేసి టీజర్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే.. ఇందులో మోహన్‌లాల్‌తోపాటు జూనియర్ ఎన్టీఆర్ కొత్త గెటప్స్‌ని చూపించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. కొంత మాస్ కంటెంట్‌ కూడా ఈ టీజర్‌లో వుండనుందని సమాచారం. మొత్తంగా.. ఈ టీజర్ ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేసేలా వుంటుందని అంటున్నారు.

ఇది నందమూరి ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్తే. కాగా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ విషయంలో తారక్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇతని సరసన సమంత, నిత్యామీనన్‌లో హీరోయిన్లుగా నటిస్తుండగా.. మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -