- Advertisement -

పాకిస్తాన్ లో ఎన్టీఆర్ సంచలనం !

- Advertisement -

మన సినిమాలకు పాకిస్థాన్ కి ఏమైనా సంబందం ఉందా. బాలీవుడ్ సినిమాలనే రేర్ గా చూసే పాకిస్తాన్ వాళ్ళు మన డబ్బింగ్ సినిమాలు టచ్ కూడా చేయరు అని చెప్పొచ్చు. అలాంటిది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ నాన్నకుప్రేమతో కి సంభందించిన ఒక గ్రేట్ రికార్డు అక్కడ నెలకొంది.

అదీ రెండు రోజుల తరువాత వెలుగులోకి వచ్చినా.. రికార్డు రికార్డే కదా.రెండు రోజుల క్రితం నాన్నకుప్రేమతో అఫీషియల్ గా జనవరి 13 న రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు నిర్మాతలు. దాంతో ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఈ వార్తను తెగ ట్రెండ్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇదే ట్రెండ్ ఇక్కడితో పాటుగా పాకిస్తాన్ లో కూడా జరగడం.

అదేరోజు రాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు నిర్విరామంగా నాన్నకుప్రేమతో ఫర్ సంక్రాంతి అంటూ ట్రెండ్ చేసిన పాకిస్థానీలు ఆ రోజు టాప్ 10 ట్రెండింగ్ లలో మూడో ప్లేస్ లో నాన్నకుప్రేమతోని నిలిపారు. ఈ విషయాన్ని తెలుగుకున్న మనవాళ్ళు తెలుగు సినిమాలు అందులో ఎన్టీఆర్ కి అక్కడ ఇంత క్రేజ్ ఉండటం ఏంటని ఆశ్యర్యపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -